సీఐ నిర్వాకం.. పోలీస్స్టేషన్లో కాంట్రాక్టర్ బర్త్డే వేడుక
Published on: Mon May 6, 2019 3:25PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ పోలీస్స్టేషన్లో రవీందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ పుట్టిన రోజు వేడుకలను సీఐ ఇంద్రసేనారెడ్డి తన ఛాంబర్లో నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ బర్త్డే వేడుకల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
జిల్లాలోని వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి బర్త్డే వేడుక ఈ నెల 4వ తేదీన.. మానకొండూరు సీఐ ఇంద్రసేనారెడ్డి ఘనంగా నిర్వహించారు. అతని పేరులో ఉన్న అక్షరాలకు.. ఒక్కొక్క అక్షరానికి కేజీ చొప్పున కేక్ తీసుకువచ్చి వేడుకలు చేశారు. పోలీసులందరూ ఒక్కొక్కరు అతనికి కేక్ తినిపించారు. ఈ వేడుకను వీడియో తీశారు. ఇప్పుడా వీడియో వైరల్ కావడంతో వ్యవహారం వివాదాస్పదమైంది. డిపార్టుమెంట్తో సంబంధం లేని ఓ వ్యక్తి బర్త్ డే వేడుకలు పోలీస్స్టేషన్లో నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.



