TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభం

Published on: Fri May 1, 2026 1:00PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అమరావతిలో బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు శుక్రవారం (మే1) ప్రారంభమయ్యాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు.  అమరావతి ప్రాంతంలో ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరిం చేందుకు కీలకంగా భావి స్తున్న ఈ ఆస్పత్రిని అమ రావతి సమీపంలోని తుళ్లూరు వద్ద 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్ల వ్యయంతో  నిర్మిస్తున్నారు. 

మొదటి దశలో  500 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమైంది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స, పరిశోధన సేవలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో నందమూరి బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దుతున్నారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మెరుగైన క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమన్నారు. భవిష్యత్తులో ఈ ఆస్పత్రిని జాతీయ స్థాయి వైద్య కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.