'కాంగ్రెసు,వైయస్సార్ కాంగ్రెసు వేరు కాదు '
Published on: Wed Jan 4, 2012 3:30PM
హై
దరాబాద్: కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు వేర్వేరు కాదని, కాంగ్రెసు అనే విషవృక్షంలో వైయస్సార్ కాంగ్రెసు ఓ కొమ్మ మాత్రమేనని తెలుగుదేశం సీనియర్ నేత కె. ఎర్రన్నాయుడు వ్యాఖ్యానించారు. జగన్ ఆస్తుల కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి విజయ సాయి రెడ్డి రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్‌గా వెళ్లేందుకు ప్రయత్నించారని, ఆ ప్రయత్నానికి ప్రభుత్వం సహకరించిందని అయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. విచారణ జరుగుతున్న సమయంలో విజయ సాయి రెడ్డిని రిజర్వ్ బ్యాంకు డైరెక్టర్‌గా నియమించవచ్చునేమో తెలిపాలని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ నుంచి క్లియరెన్స్ కోరినట్లు ఆయన తెలిపారు.ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అడగాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందని ఆయన అడిగారు. జగన్, కాంగ్రెసు కుమ్మక్కయ్యారని చెప్పడానికి అదే నిదర్శనమని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ప్రతి కుంభకోణంలోనూ సంబంధిత ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రులను, అధికారులను బాధ్యులను చేయాలని, వారిపై విచారణ జరిపించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


