ఏపీలో కాంగ్రెస్ కీలకం.. ప్రత్యేకహోదా ఫైలుపై తొలి సంతకం.!!

 

రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ ఊసే లేదు.. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకొని ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఏపీలో ఇప్పట్లో కాంగ్రెస్ కి పూర్వ వైభవం కష్టమే.. కానీ ఎంతో కొంత పుంజుకోవాలని చూస్తుంది.. ఆ దిశగా అడుగులు కూడా మొదలు పెట్టింది.. కాంగ్రెస్ బలపడటమే కాదు వచ్చే ఎన్నికల్లో ఏపీలో కీలకమైన పార్టీ అవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు..

 

 

తాజాగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ మాట్లాడుతూ.. ఏపీలో 2019 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాంగ్రెస్‌ మద్దతు కీలకమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ దగా చేసిందన్నారు.. వెంకయ్యనాయుడు వల్లే రాష్ట్రానికి హోదా వస్తుందని మోదీ అప్పట్లో చెప్పారని, ఇప్పుడు వెంకయ్యనాయుడు, హోదా ఎటుపోయాయో అర్థం కావడం లేదన్నారు.. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఫైలుపై రాహుల్‌గాంధీ ప్రధానిగా తొలి సంతకం చేస్తారని చెప్పారు.