TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాయలార్ రవిని కలిసిన కెవిపి, బొత్స

Published on: Tue Apr 17, 2012 12:28PM

సోనియా దూతగా ప్రత్యేక పరిశీలకుడి హోదాలో హైదరాబాద్‌ వచ్చిన వాయలార్ రవిని కెవిపి రామచంద్ర రావు మంగళవారం ఉదయం తాజ్ కృష్ణలో కలిశారు. కాగా వాయలార్ రవి కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు.మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండనున్న ఆయన రాష్ట్ర విభజన, సిఎం, పిసిసి చీఫ్‌ల పనితీరుపై పార్టీ నేతల అభిప్రాయాలను తెలుకుని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాకు ఓ సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో సిఎం, పిసిసి చీఫ్‌ల మార్పు ఉంటుందని సమాచారం.కాగా పిసిసి చీఫ్ బొత్సతో రవి భేటీ అయ్యారు.