TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోనియాకు మోడీ విషెస్.. ఇందిరా గాంధీ కోడలిని.. భయపెట్టలేరు.. సోనియా

Published on: Wed Dec 9, 2015 2:49PM

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఈ రోజు 69వ పుట్టినరోజు సందర్భంగా పలువురు నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఆమె పుట్టిన రోజు సందర్బంగా కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు ప్రధాని నరేంద్రమోడీ కూడా సోనియా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆ భగవంతుడు సోనియాకు సుదీర్ఘ జీవితాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ట్వీట్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్ చేశారు.

ఇదిలా ఉండగా ఉభయసభల్లో ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కేసు గురించి రగడ జరుగుతుంది. అయితే దీనిపై సోనియా మీడియా ముందు మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నేను ఇందిరా గాంధీ కోడలిని.. నన్ను ఎవరూ భయపెట్టలేరంటూ మండిపడ్డారు..