కడప ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం
Published on: Wed Apr 25, 2012 11:21AM
కడపజిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రాజంపేటకు మేడా మల్లిఖార్జునరెడ్డి, రాయచోటికి రాంప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరుకు కనపర్తి ఈశ్వరయ్య పేరును కాంగ్రెస్ అధిస్థానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. జిల్లాకు చెందిన మంత్రి పి.రామచంద్రయ్య, ఎంపి సాయిప్రతాప్ నేతృత్వంలో జిల్లా ఇన్ ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ భుజస్కందాలపై ఈ ఉప ఎన్నికల బాధ్యతను కాంగ్రెస్ పార్టీ పెట్టింది.
ఈ మూడు స్థానాల్లో టిక్కెట్లు ఆశించి నిరాశకు గురైన నాయకులను బుజ్జగించే పని కన్నా లక్ష్మీనారాయణకే కట్టబెట్టారు. వీరికి నామినేటేడ్ పదవులు ఇస్తామన్న ఆశను చూపిస్తున్నట్లు తెలిసింది. కడప ఎంపి సాయిప్రతాప్ ఎన్నికల బాధ్యతను ఇంతవరకూ చేపట్టకపోవడం కాంగ్రెస్ నాయకులను కలవరపెడుతోంది. సాయిప్రతాప్, కన్నాతో సహా కాంగ్రెస్ నాయకులేవరికీ అందుబాటులో ఉండటం లేదు.


