కాంగ్రెస్ అభ్యర్థులకు శాపంగా మారిన పెట్రోల్ ధరలు
Published on: Fri May 25, 2012 12:25PM
రాష్ట్రంలోని 18 అసెంబ్లీ, ఒక లోక్ సభకు జరుగుతున్న ఉపఎన్నికలపై పెరిగిన పెట్రోల్ ధర ప్రభావం పడింది. ఈ నియోజకవర్గాల్లో పోటిలో ఉన్న అభ్యర్థులను వోటర్లు నిలదీస్తున్నారు. ఒక్కసారిగా లీటరుకు రూ.7.50. పెరగటం అటు సామాన్య, మధ్యతరగతి ప్రజలు జీర్ణించుకోవటం లేదు. ఉన్నత వర్గాలు కూడా పెట్రోలు కారు వాడకాన్ని మానేసి డీజిల్ కార్లకు మారిపోవాలని యోచిస్తున్నాయి. దీంతో కారు కంపెనీలు కూడా బెంబేలెత్తుతున్నాయి. నిన్నటి దాకా స్టాక్ లేవని తిప్పుకున్న వాహనాల డీలర్లకు తమ ఆర్డర్లు క్యాన్సిల్ చేయమని కాల్స్ వస్తున్నాయట. అసలే పెరిగిన పెట్రోలు దెబ్బకు పెరిగిన సైకిల్ ధర తక్కువగా కనిపిస్తోంది. ఏ కాలుష్యం లేని, పెట్రోలు వాడకంతో పని లేని సైకిల్ వైపు జనం మొగ్గుచూపుతున్నారు. ఈ ప్రభావం ఆటోఫీల్డ్ ఎక్కువగా ఉన్న నెల్లూరులో బాగా కనిపిస్తోంది. తిక్కవరపు సుబ్బరామిరెడ్డి తాను అభ్యర్థిగా పోటీ చేసేది ప్రజాసేవ కోసమేనని స్పష్టం చేస్తూ ఈ పెట్రోలు ధరల విషయాన్ని పక్కదారి పట్టించేసి ముందుకు వెళుతున్నారు. ఈ పెట్రోలు ప్రభావం వల్ల తమకు నష్టం జరుతుతోందని కాంగ్రెస్ అభ్యర్థులు కలవరపడుతున్నారు. పెట్రోల్ తో పాటు డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్ ధరలు కూడా పెరుగుతాయంటూ వస్తున్న వార్తలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆందోళనకు గురిచిస్తున్నాయి. పోలింగ్ లోపు వీటి ధరలు పడితే తమకు డిపాజిట్ లు కూడా దక్కవన్న భయాందోళనలో కొందరు అభ్యర్థులు ఉన్నారు.


