ఒక్క కాంగ్రెస్ వంద నాలుకలు

 

దిగ్విజయ్ సింగ్: రానున్న ఎన్నికల ముందుగానే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి కృషి చేస్తాము.

 

పీసీ చాకో: ఎన్నికల ముందుగా తెలంగాణా వస్తుందో లేకపోతే తరువాత వస్తుందో చెప్పలేము.

 

దిగ్విజయ్ సింగ్: రాష్ట్రంలో అన్ని పార్టీలను సంప్రదించి,వాటి అభిప్రాయలు తీసుకొన్న తరువాతనే రాష్ట్ర విభజన చేయాలనీ నిశ్చయించుకొన్నాము. ఇక ఈ నిర్ణయంపై ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.

 

పీసీ చాకో: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పరచిన మంత్రి వర్గ బృందానికి (జీ.ఓ.యం.) తొలుత పెట్టిన ఆరువారాల గడువు ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించాము. ఎందుకంటే రాష్ట్ర విభజన ప్రక్రియలో ఆ బృందం అనేక మంది  వ్యక్తులతో, పార్టీలతో విస్తృతంగా చర్చలు జరుపవలసి ఉంది. అందువల్ల మంత్రి వర్గ బృందం తనకు అప్పజెప్పిన పనులను పూర్తి చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితి ఏమి విడించలేదు.

 

దిగ్విజయ్ సింగ్: ప్రాంతీయ పార్టీలు ఎన్ని ‘యు’ టర్నులయినా తీసుకోగలవు. కానీ జాతీయ పార్టీ అయిన మా కాంగ్రెస్ పార్టీ ఆవిధంగా చేయదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ మాది. పీసీ

 

చాకో:!!!

 

కిరణ్: ప్రజాభీష్టాన్ని మన్నించకుండా ప్రభుత్వాలు ముందుకు వెళితే  అటువంటి ప్రభుత్వాలకి ప్రజలు శలవు ప్రకటిస్తారు.

 

బొత్స: కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం అందరికీ శిరోదార్యం. క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా అధిష్టానం నిర్ణయాన్ని అమలుచేయడం మా అందరి బాధ్యత.

 

వీ.హెచ్: మా సోనియమ్మ ఒకసారి మాటిస్తే మరిక దానికి తిరుగు ఉండదు. అధిష్టానం నిర్ణయాన్ని హృదయపూర్వకంగా శిరసావహిస్తాము.

 

బొత్స: అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేము కానీ ప్రజల మాటను కూడా వినాలి కదా? నేను అసలు సిసలయిన సమైక్యవాదిని. నాకు పదవులు ముఖ్యం కాదు. ప్రజలే ముఖ్యం.

 

లగడపాటి: మా కాంగ్రెస్ పార్టీయే మమ్మల్ని, ప్రజల్ని కూడా మోసం చేసింది. ఎవరికోసమో మా అందరి జీవితాలతో ఆడుకొంటోంది.

 

బొత్స: మా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి క్లిష్టమయిన సమస్యనయినా దైర్యంగా ఎదుర్కొని పరిష్కరించే సత్తా గలది. సమస్యలు వచ్చినప్పుడు పార్టీని వదిలిపోవడం మా నైజం కాదు.

 

ఉండవల్లి: ప్రజాభీష్టాన్నిమ, మా అభిప్రాయాలకు విలువనీయని కాంగ్రెస్ పార్టీలో ఉండటం కంటే బయటకి పోవడమే మంచిదని పార్టీకి, నా యంపీ పదవికీ రాజీనామా చేసాను.

 

బొత్స: వెనుకబడిన వర్గానికి చెందిన నాపై రాజకీయ కుట్ర జరుగుతోంది. మా పార్టీలోనే కొందరు పెద్దలు అంతా తాము చూసుకొంటామని నమ్మబలుకుతూ  రాష్ట్ర విభజన విషయంలో నన్ను పక్క దారి పట్టించారు.