కాంగ్రెస్ లో వర్గపోరును బయటపెట్టిన జేసీ
Published on: Sat Jan 28, 2012 9:16AM
హైదరా
బాద్: కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంటూనే ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ పెద్దదైనందు వల్ల స్వేచ్ఛగా ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునే అవకాశముందన్నారు.చిన్నచిన్న పార్టీల్లో ఇటువంటిది సాధ్యం కాదనీ, కాంగ్రెస్ మహాసముద్రం లాంటిది కనకు ఇక్కడ ఇటువంటివి కానవస్తుంటాయన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత అణుమాత్రం తగ్గలేదని ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పారాయన.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినవారు తిన్నగా కాంగ్రెస్ గూటికే తిరిగి వచ్చేస్తారని జోస్యం చెప్పారు. కొత్తక వింత పాతొక రోతలా వెళ్లిపోయిన వారికి కొత్తగా వెళ్లిన చోట పాత రోతకు మించిన రోత ఉన్నదని తెలుసుకుని వెనక్కి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తన వద్ద సమాచారం ఉన్నదన్నారు. వారంతా తిరిగి వచ్చేందుకు ఆట్టే సమయం పట్టదని చెప్పుకొచ్చారు.


