వైదొలగాలని అల్టిమేటం..కాంగ్రెస్‌కు మమతా సవాల్!
Published on: Tue Jan 10, 2012 10:48AM
పశ్
చిమ బెంగాల్ : కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏమాత్రం దమ్మున్నా తమ ప్రభుత్వం నుంచి వైదొలగాలని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. బెంగాల్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య ఏమాత్రం పొసగడం లేదు.దీంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీఎంసీ యువజన విభాగం భారీ ర్యాలీ నిర్వహించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీపై టీఎంసీ మంత్రులు, నేతలు విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టారు.కాంగ్రెస్ పార్టీ నేతలకు దమ్ముంటే తమ సర్కారు నుంచి వైదొలగాలని మమతా బెనర్జీ సవాల్ విసిరారు. ఇందుకోసం అన్ని ద్వారాలు తెరిచి ఉంచినట్టు తెలిపారు. అలాగే,టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థా చటర్జీ మాట్లాడుతూ ఆ పార్టీకి దమ్ము, ధైర్యం ఉంటే సొంతంగా ఎన్నికలను ఎదుర్కోవాల్నారు. మమత ఫొటో లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల్లో గెలవగలమని నిరూపించుకోవాలి సవాల్ విసిరారు.


