TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నమమతా!

Published on: Wed Jan 4, 2012 11:22AM

ఉత్తర ప్రదేశ్ : కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ చుక్కలు చూపిస్తున్నారు. గతంలో పెట్రో ధరలు ప్రస్తుతం లోక్‌పాల్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి అడ్డుపడింది.లోక్‌సభలో ఆమోదించిన లోక్‌పాల్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించకుండా అడ్డుపడటం ద్వారా కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడవేసి ఇబ్బందులకు గురి చేసిన మమత తాజాగా కోల్‌కతాలోని ఇందిరాభవన్ పేరును పశ్చిమ బెంగాల్ ప్రముఖ కవి ఖాజీ నజ్రూల్ ఇస్లాం పేరుతో ‘నజ్రూల్ భవన్’గా మార్చనున్నట్టు ప్రకటించారు.పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పని చేయటంతో పాటు తమ పార్టీ, ప్రభుత్వంపై దాడులు చేస్తున్నారంటూ మమత ఆరోపించడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని ఇందిరా భవన్ పేరును నజ్రూల్ ఇస్లాం భవన్‌గా మార్చాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించటం ద్వారా మమత మరోసారి కాంగ్రెస్‌కు చెమటలు పట్టించారు.

రెండు దశాబ్దాలు ముఖ్యమంత్రిగా పని చేసిన జ్యోతిబసు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఇందిరా భవన్‌లో ఉన్నారు. జ్యోతిబసు మరణించిన అనంతరం ఆయన బంధువులు ఇటీవలే ఇందిరా భవన్‌ను ఖాళీ చేసిన సంగతి తెలిసిందే. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఈ భవనాన్ని నిర్మించారు. మరి ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.