TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నా చేతుల్లో లేదు,అది సీఎందే : బొత్స

Published on: Sat Dec 24, 2011 8:04AM

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు దక్కడం లేదని, ఇలాగైతే గాంధీభవన్ మెట్లపై ధర్నాకు దిగుతామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పలువురు నేతలు హెచ్చరించారు. గాంధీభవన్‌లో  పీసీసీ కార్యవర్గ సభ్యులు సునీతారావు, మధు, తివారీ తదితరులు బొత్స తో భేటీ అయ్యారు.2005 తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీకి నోచుకోకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా బొత్సను కలిసిన సునీతారావు నామినేటెడ్ పదవుల కోసం ధర్నా చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. దీంతో ధర్నా ఎక్కడ చేస్తారంటూ సత్తిబాబు ప్రశ్నించారు. గాంధీభవన్ మెట్లపై చేస్తామని ఆమె సమాధానం ఇచ్చారు.నామినేటెడ్ పదవులను ఇచ్చేది తాను కాదని అది ముఖ్యమంత్రి విచక్షణాధికారమని బొత్స చెప్పారు. సెక్రటేరియట్ వద్ద చేస్తే ఫలితం ఉంటుందేమోనని ఆయన కాస్త కటువుగానే అన్నారు. దీంతో ఏఐసీసీ కార్యాలయం ముందే ధర్నాకు దిగాలని పీసీసీ నేతలు నిర్ణయించారు.