తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలది డ్రామా: కిషన్ రెడ్డి
Published on: Thu Apr 26, 2012 9:22AM
లోక్సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలది డ్రామా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ డ్రామాకు స్క్రిప్ట్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కాంగ్రెస్కు ధైర్యం ఉంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే తమ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని తెలిపారు.కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ కన్నా వచ్చే ఎన్నికల్లో ఓటమి భయమే ఎక్కువగా ఉందన్నారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకు రావడం సరికాదన్నారు. సుష్మా స్వరాజ్ని టీఆర్ఎస్ విమర్శించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలంతా టీఆర్ఎస్లో చేరడానికే ఈ డ్రామా అని విమర్శించారు. కాంగ్రెస్తో తాము ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదని, అధికారం పంచుకోలేదని ఆయన తెలిపారు.


