జగన్ పార్టీలోకి పేర్నినాని: కాంగ్రెస్ కి షాక్
Published on: Thu Jan 24, 2013 3:52PM

కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పేర్ని నాని షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ములాఖత్ సమయంలో నాని కలిశారు. తాను కష్టకాలంలో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనను ఎన్నుకున్న ప్రజల కోసం ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని అనుకున్నానని.. కానీ జగన్ ను ఇబ్బంది పెడుతుంటే తట్టుకోలేక పార్టీ వీడానని చెప్పారు.
నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకే తాను జగన్ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. తాను త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని చెప్పారు.


