TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే జయమణి?

Published on: Wed May 30, 2012 5:35PM

అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి నిరసనగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజన కృష్ణ రంగారావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన జిల్లా కేంద్రానికి వెళ్లి పార్వతీపురం ఎమ్మెల్యే జయమణితో సమావేశమై, జగన్ అరెస్టు తదనంతరం పరిణామాలపై విపులంగా చర్చించారు. దీంతో ఆమె కూడా తన పదవితో పాటు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైకాపాలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. విజయనగరం జిల్లాలో ఇప్పటికే పార్టీకి జరిగిన నష్టం నుంచి తేరుకోక ముందే.. జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.