మోడీకి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్

 

గత ఎన్నికలు మిగిల్చిన అనుభవాలు, ఉపఎన్నికల ఫలితాలు తెచ్చిన ఆశలతో.. మోడీకి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది.. మొన్నటివరకు అధికారమే లక్ష్యంగా ముందుకు సాగిన కాంగ్రెస్ ఇప్పుడు మోడీని గద్దె దించడమే లక్యంగా సాగుతుంది.. బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది, ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి దూరమవుతున్నాయి.. ఇదే కాంగ్రెస్ పాలిట వరంలా మారనుంది..

కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలను కలుపుకొనిపోతూ, ప్రజలకి దగ్గరవ్వాలని చూస్తుంది.. మోడీకి చెక్ పెట్టేందుకు అవసరమైతే ఒక మెట్టు దిగైనా ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తుంది.. దానిలో భాగంగానే వీలైనన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీచేయనుంది.. అంతేకాదు ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ స్థానాలు సర్దుబాటు చేసి, కాంగ్రెస్ తక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్దపడినట్టు తెలుస్తుంది..

విశ్లేషకుల అంచనాల ప్రకారం కాంగ్రెస్ కేవలం 200 నుండి 250 లోక్ సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేయబోతోందని, ప్రాంతీయ పార్టీలను కలుపుకొనిపోవడమే కాకుండా, వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి మోడీకి చెక్ పెట్టే మాస్టర్ ప్లాన్ వేసిందని అంటున్నారు.. ప్రాంతీయ పార్టీలతో కలిసి మోడీకి చెక్ పెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ ఆశలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.