ఏపీ రాజధాని: ముహూర్తం చాలా మంచిది

 

ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ ఏదోరకంగా వార్తల్లో వుండాలని ప్రయత్నిస్తోంది. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు ప్రారంభించి పథక రచన చేసింది. అందులో భాగమే మొన్నీమధ్య చిరంజీవి తదితరులు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును విమర్శించడం. చిరంజీవి చేసిన విమర్శలు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కామెడీ సినిమా చూసినట్టుగా నవ్వుకున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడాలని అనుకుంటున్న వాళ్ళ అమాయకత్వం చూసి జాలిపడ్డారు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 12 గంటల 17 నిమిషాలకు అసెంబ్లీలో చేయబోతున్నారు. దీని మీద ఎలా విమర్శించాలో అర్థంకాని కాంగ్రెస్ నాయకులు కొత్త వాదనను తెరమీదకి తీసుకొచ్చారు. చంద్రబాబు రాజధాని గురించి ప్రకటించే ముహూర్తం మంచిది కాదని అంటున్నారు. అయితే దీనికి తెలుగుదేశం వర్గాలు ఖండిస్తున్నాయి. జ్యోతిష శాస్త్రాన్ని ఔపోసన పట్టిన పండితులతో పెట్టించిన చాలా మంచి ముహూర్తమని, కాంగ్రెస్ నాయకులకు జ్యోతిషం అంత బాగా తెలిస్తే, ఆ ముహూర్తాలేవో మొన్నటి ఎన్నికలలో పెట్టుకుని గెలిచి వుండాల్సిందని వెటకారంగా ఎద్దేవా చేస్తున్నారు.