TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం కలల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కోర్టుకెక్కిన కాంగ్రెస్ నేత.. కాంగ్రెస్ లో ఇది మామూలేగా?

Published on: Mon Mar 3, 2025 9:14AM

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు అయిన కేబీఆర్ పార్క్ ఫ్లై ఒవర్ నిర్మాణం కోసం రోడ్ల విస్తరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతే కోర్టుకు ఎక్కారు. పైగా ఆ కాంగ్రెస్ నేత ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కు స్వయానా మామ కావడం విశేషం. 

కేబీఆర్ పార్క్ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటిని కూల్చవద్దంటే కాంగ్రెస్ నేత, అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖరరెడ్డి వ్యక్తిగత హోదాలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణ కు భంగం కలిగే విధంగా చేపడుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని ఆపాలని ఆ పిటిషన్ లో కోరారు. కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణలు చేపట్టడం పర్యావరణానికి భంగం కలిగించడమేనని ఆయనా పిటిషన్ లో పేర్కొన్నారు.  ఇప్పటికే కేబీఆర్ పార్క్ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తే హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసందే.  ఈ ఫ్లై ఒవర్ నిర్మాణం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి సహా పలువురు ప్రముఖుల ఇళ్లు కూడా కూల్చివేతకు గురయ్యే అవకాశం ఉంది.

అయితే వారెవరూ ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు ఎక్కలేదు. కానీ అల్లు అర్జున్ మామ మాత్రం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడం గమనార్హం. పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ వివాదంలో ఇరుక్కోవడం, ఆయన ఆ సమయంలో  మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మామ రేవంత్ కలల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కోర్టుకెక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.