TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజకీయ లబ్ది కోసమే తాత్కాలిక రాజధాని... బొత్స....

Published on: Tue Aug 12, 2014 10:35PM

 

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఏర్పాటు చేయడంపై పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. తెలుగుదేశం పార్టీలోని కొందరికి లాభం చేకూర్చడానికే తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎంపిక చేశారనిఆయన ఆరోపించారు. తాత్కాలిక రాజధానిగా హైదరాబాద్ ఉండగా మరో తాత్కాలిక రాజధాని ఎందుకు అని బొత్స ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన అన్నారు. తాత్కాలిక రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తామని బొత్స అన్నారు.