మాజీమంత్రి కాసుకి తప్పిన పెనుప్రమాదం..

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ మలుపు వద్ద కృష్ణారెడ్డి కారుకి ఆర్టీసీ బస్సు అడ్డువచ్చింది. కారును చూసిన బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో కారు బస్సును రాసుకుంటూ వెళ్లింది. డ్రైవర్లు ఇద్దరు సమయస్పూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.