TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫాన్స్ ఘర్షణ పడటం సరికాదు ..ఫోన్ లో చేప్తా

Published on: Wed Jan 25, 2012 2:10PM

హైదరాబాద్: అభిమానులు ఘర్షణ పడటం మంచికాదని, తాను ఎవరినీ రెచ్చగొట్టేలా మాట్లాడలేదని కాంగ్రెస్‌నేత చిరంజీవి పేర్కొన్నారు.తన అభిమానులు ఎలా ఉండాలో వారికి ఫోన్ చేసి చెబుతానని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి  మీడియాతో అన్నారు. మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఉదయం తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. దీనికి చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సి.రామచంద్రయ్యలు హాజరయ్యారు. అనంతరం చిరంజీవిని మీడియా పలకరించింది. అభిమానులు పరస్పరం గొడవలకు దిగడం సరికాదన్నారు. ఇలాంటి వాతావరణం తీసుకు రావడం మంచిది కాదన్నారు. మీ అందరికీ తెలుసునని తాను ఎప్పుడూ ఘర్షణలకు చోటిచ్చేలా మాట్లాడలేదన్నారు. అలా మాట్లాడటం ధర్మం, బాధ్యత కాదన్నారు. అభిమానులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటా శ్రీనివాస రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు హెచ్ సౌత్ బ్లాకు మూడో అంతస్తులోని తన చాంబర్‌లో గంటా శ్రీనివాస రావు బాధ్యతల చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ శాఖ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిదిలోనిది అన్నారు. ఏ శాఖ ఇచ్చినా బాధ్యతాయుతంగా నిర్వహిస్తానన్నారు. కాగా గంటా కాకినాడలో పోర్టు భవనానికి రూ.30 కోట్లను కేటాయిస్తూ మొదటి ఫైల్‌పై సంతకం చేశారు. కాకినాడ పోర్టులో స్థానికులకే అధిక ఉద్యోగాలు ఉండేలా చూస్తామన్నారు.