కాంగ్రెస్ నగదు బదిలీ పధకం ఫై ఈసి సీరియస్
Published on: Mon Dec 3, 2012 3:03PM

గుజరాత్లో ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ నగదు బదిలీ పధకాన్ని ప్రకటించడం ఫై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ఈ పధకాన్ని ఎలా ప్రకటించారని ఎన్నికల సంఘం కేంద్ర కేబినేట్ కార్యదర్శిని వివరణ అడిగింది. ఈ రోజు సాయంత్రానికి వివరణ ఇవ్వాలని ఆయనకు ఈసి సూచించింది.
గుజరాత్ కు ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ పధకాన్ని ప్రకటించి ఉండాల్సింది కాదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. కేంద్రం తగిన రీతిలో వివరణ ఇవ్వక పొతే, కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈసి ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ఈ సి దృష్టికి తీసుకు వచ్చింది.


