TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ మునిగిపోతున్న నావ,టిఆర్ఎస్ ఖతం బాబు

Published on: Thu Jan 12, 2012 9:27AM

హైదరాబాద్: కాంగ్రెసు సర్కారును నిలబెట్టిన చిరంజీవి గుర్తింపులేని స్థాయికి పడిపోయారని  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడినట్లుగా సమాచారం. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉన్న గుర్తింపును పోగొట్టుకున్నారని, ఆయన సినిమాలలోనే కొనసాగి ఉంటే ఇంకా ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చేవని అయన అన్నట్టు సమాచారం. కాంగ్రెసు పార్టీ మునిగిపోతున్న నావ అని తన ప్రజారాజ్యం పార్టీని ఆ పార్టీలో విలీనం చేసి ఇప్పుడు పదవుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని అన్నట్టుగా తెలుస్తోంది. రాజకీయాల్లోకి రావడం వల్లే ఆయన ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారని తెలుస్తోంది. కాంగ్రెసు పరిస్థితి చూసి ఆ పార్టీలో కొనసాగేందుకు నాయకులెవరూ ఇష్టపడటం లేదన్నారు.మద్యం దుకాణాలు ఉన్నాయని చెప్పుకున్న బొత్స సత్యనారాయణకు పిసిసి చీఫ్‌గా కొనసాగే హక్కు లేదని, ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తి అన్నారు. ఆయన మంత్రి, పిసిసి చీఫ్ కావడం దారుణమన్నారు. చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి, టిఆర్ఎస్‌పై విరుచుకు పడ్డారు. రానున్న రోజుల్లో కెసిఆర్ పార్టీని నడపలేరని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ పని ఖతం అన్నారు. జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్లే బాధ్యులు, కమ్యూనికేటర్ల సమావేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలోనే చంద్రబాబు మాట్లాడారు.