TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ వద్దు...రాయల తెలంగాణ ముద్దు!

Published on: Tue Dec 3, 2013 2:37PM

 

 

రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తుది నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇన్నాళ్లు వివిధ ఆఫ్షన్లను పరిశీలించిన కేంద్ర ఇప్పుడ ఫైనల్‌గా రాయల తెలంగాణకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలోని పది జిల్లాలతో పాటు అనంతపురంచ కర్నూల్‌ జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.


హైదరాబాద్‌ను యూనియన్ కో-ఆర్డినేషన్ కౌన్సిల్‌గా చేయనున్నారని, భద్రాచలం, పోలవరం ముంపు ప్రాంతాలు తెలంగాణలోనే ఉండేటట్లుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. ఇరు ప్రాంతాలకు సంబంధించి నీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక జలమండలిని ఏర్పాటు చేయనున్నారని, హైదరాబాద్‌ను హైకోర్టు ఆఫ్ హైదరాబాద్‌గా పేరు మార్పు చేస్తూ, తెలంగాణకు ప్రత్యేక బార్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

 

video courtesy ABN