TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్.. కేటీఆర్

Published on: Wed Jun 3, 2026 12:55PM

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాట తప్పిందని దుయ్యబట్టారు.  వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ   నినాదం రైజింగ్.. విధానం  ఫాలింగ్ అని ఎద్దేవా చేశారు. 

హామీల అమలు గురించి ప్రశ్నిస్తే.. అభివృద్ధి పై నిలదీస్తే.. ఎంత పహిల్వాన్ అయినా మూడు నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా అంటున్న సీఎం.. 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే ఏమనాలి, నపుంసకులు అనాలా అని ఎద్దేవా చేశారు. రెండేళ్లుగా ప్రభుత్వ ఆదాయం పతనమవుతోందన్నారు. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని ప్రజలకు అర్థమైందన్నారు. చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్  అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్..  రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం  4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు. ఇక ఫ్యూచర్ సిటీ అంటూ చేస్తున్న ఆర్భాటం అంతా ఉత్తిత్తిదేనన్నారు.  అక్కడ భూములు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములని కేటీఆర్ చెప్పారు.