TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద కుట్ర

Published on: Wed May 8, 2019 5:23PM

 

తెలంగాణలో ఎన్నికలు గూడుపుఠాణిలా మారాయని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ ధ్వజమెత్తారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌పై పలు అభ్యంతరాలను తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సీఈవో రజత్‌కుమార్‌ అనుకూలంగా పనిచేస్తున్నారని, సునీల్ అరోరాకు ఆయన ఫిర్యాదు చేశారు.  అర్ధరాత్రి షెడ్యూల్‌ ఇచ్చి తెల్లవారు జామునుంచే నామినేషన్‌ స్వీకరించడమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని.. కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. అర్ధరాత్రి షెడ్యూల్ ఇచ్చి తెల్లవారుజాము నుంచే నామినేషన్ స్వీకరించడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. పాత ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో ఎన్నికల నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. టీఆర్ఎస్ కు లబ్ది చేకూర్చేవిధంగా పాత ఎంపీటీసీ, జడ్పీటీసీలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కు అన్ని వివరాలను అందజేశాను అన్నారు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ,  జడ్పీటీసీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై పెద్ద కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చిందిని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.