Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉత్సాహాన్ని ఇస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ ఆరోపణలు
posted on: May 16, 2012 12:49PM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు చేయడం, ముఖ్యమంత్రి, పిసిసి నేత బొత్స సత్యనారాయణ, చిరంజీవి ముగ్గురూ కలిసి ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ప్రయత్నించారని, అవినీతికి చిరునామా జగన్ అంటూ ముఖ్యమంత్రి విమర్శలతో విరుచుకుపడటం ప్రజలలో ఆలోచన కలిగిస్తోంది.
నిన్నమొన్నటి వరకూ జగన్ పై ఎటువంటి విమర్శ చేయని, లక్ష చదరపు అడుగుల్లో ఇళ్ళు ... 75 పడకగదులతో ఇళ్ళు కట్టుకున్న జగన్ పదవికోసం వెంపర్లాడుతున్నాడంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో నేరుగా జగన్ పై విరుచుకుపడటం, నేతలు ముగ్గురూ కలిసి ప్రచారం చేయడం ఓటర్లలో మార్పు తీసుకువస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కిననాటి నుండి జగన్ ను పల్లెత్తు మాట కూడా అనని కిరణ్ నేడు తీవ్రమైన స్థాయిలో జగన్ పై ఆరోపణలు చేయకపోతే తన రాజకీయమనుగడ వుండదని ఆయన గుర్తించడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్ కు కిరణ్ అత్యంత సన్నిహితుడని, నిజానికి కిరణ్ ప్రభుత్వం వైఎస్ జగన్ కు కోవర్టుగా పనిచేస్తోందన్న ఆరోపణలు నిజమనే భావన ప్రజలలో కలగడమే కాకుండా చివరకు అధిస్థానం కూడా నమ్మే పరిస్థితి ఏర్పడింది. దాంతో ఉప ఎన్నికల తర్వాత కిరణ్ కు పదవీగందం తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో పదవిని కాపాడుకోవాలంటే ఉప ఎన్నికల్లో జయాపజయాల సంతతి ఎలా వున్నప్పటికీ కనీసం తాను జగన్ కు కోవర్టును కాననే విషయాన్ని అయినా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి కిరణ్ కు ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఆయన జగన్ పై విమర్శలు సంధించడం ప్రారంభించారు. ఇప్పటివరకు జగన్ కోవర్టుగా భావించిన కిరణ్ కూడా స్వయంగా జగన్ అవినీతిని, విలాసవంతమైన భవనాల గురించి ప్రస్తావించడం ఆ ప్రభావం ఎంతోకొంత ఓటర్లపై చూపిస్తుందని భావించినట్టుగానే ఓటర్లలో మార్పు కనిపిస్తున్నట్టుగా భావిస్తున్నారు.


.png)
.jpg)


