TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భజరంగ్ దళ్, పిఎఫ్ఐపై కాంగ్రెస్ నిషేధం

Published on: Tue May 2, 2023 5:17PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ఈ నెల 10వతేదీన కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో   ఆసక్తి రేకెత్తించింది.  కర్ణాటకలో భజరంగ్ దళ్ , పిఎప్ఐ  విద్వేష ప్రసంగాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాయని  కాంగ్రెస్  ఆరోపిస్తుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే, పిసిసి ప్రెసిడెంట్  శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భజరంగ్ దళ్, హిందూ మతోన్మాదాన్ని, పీఎఫ్ ఐ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు.    కాగా గత నెల బీజేపీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తూ కేవలం భజరంగ్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై  మాత్రమే నిషేధం విధించింది. హోమ్ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తూ నిషేధిత భజరంగ్ దళ్ గూర్చి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం .