TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్నికల్లో టీఆర్ఎస్ రిగ్గింగ్.. ఆధారాలతో కోర్టుకి

Published on: Mon Jun 3, 2019 3:30PM

 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఎంపీ స్థానం పరిధిలోని బాన్సువాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు రిగ్గింగ్ చేశారని అన్నారు. తాను కేవలం ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. తన దగ్గర టీఆర్ఎస్ నేతల రిగ్గింగ్ కు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.

బాన్సువాడ నియోజకవర్గంలోని ఓటర్లు కొందరు విదేశాల్లో ఉన్నారని.. వారి ఓట్లను కూడా టీఆర్ఎస్ నేతలు వేసేశారన్నారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు తన దగ్గర ఉన్నాయని.. అధికార పార్టీ రిగ్గింగ్ పై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కోర్టులో తన గెలుపు పక్కా అని మదన్ మోహన్ ధీమా వ్యక్తం చేశారు.

తాను బరిలో నిలిచిన జహీరాబాద్ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ.. ప్రజలు మాత్రం కాంగ్రెస్ పక్షానే నిలిచారన్నారు.  రిగ్గింగ్ కు పాల్పడ్డారు కాబట్టే అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారే తప్పించి.. తాను ఓడిపోలేదన్నారు. మరి.. ఆయన దగ్గరున్న ఆధారాలపై  కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.