TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వందకు పైగా మునిసిపాలిటీలు ‘హస్త’గతం!

Published on: Fri Feb 13, 2026 12:23PM

తెలంగాణ మునిసిపల్ పోరులో కాంగ్రెస్ ఘన విజయాలు సాధిస్తున్నది. ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్ ను బట్టి చూస్తే ఏన్నికలు జరిగిన 116 మునిసిపాలిటీలలో దాదాపు వంద మునిసిపాలిటీలు హస్తగతం కానున్నట్లు కనిపిస్తున్నది.  ఈ పురపోరులో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో కూడా మునిసిపాలిటీలను దక్కించుకోలేక చతికిల పడింది.  బీఆర్ఎస్ ఆధిక్యం సాధించిన మునిసిపాలిటీలు ఎక్కువగా మెదక్ జిల్లాలోనే ఉన్నాయి.  

ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో బీఆర్ఎస్ కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత  జగదీష్ రెడ్డి నియోజకవర్గమైన సూర్యాపేటలోనూ బీఆర్ఎస్ చతికిల పడింది.    కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో కూడా కాంగ్రెస్ ఆధిపత్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  

మొత్తం మీద ఫలితాలు కాంగ్రెస్ కు సానుకూలంగా ఉన్నాయనే చెప్పాలి. ఫలితాలపై పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం సాయంత్రం దాకా వేచి చూడక తప్పదు. ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్ ను బట్టి మాత్రం పురపోరులో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిపత్యం చూపిందని అర్ధమౌతుంది.