కాంగ్రెస్ స్కెచ్ అదిరిందిగా
Published on: Tue Jun 5, 2018 3:39PM

కాంగ్రెస్ పార్టీ.. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పార్టీ.. కానీ 2o14 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయిపోయింది.. మోడీ హవాతో బీజేపీ, కాంగ్రెస్ ని చిత్తు చేసింది.. ఇక ఇప్పట్లో కాంగ్రెస్ కి పూర్వవైభవం రావడం కష్టం అనుకున్నారంతా.. కానీ అనూహ్యంగా దేశరాజకీయాల్లో మార్పు వచ్చింది.. రోజురోజుకి మోడీ హవా తగ్గుతుంది.. ప్రాంతీయ పార్టీలు మోడీకి వ్యతిరేకమవుతున్నాయి.. దీన్నే కాంగ్రెస్ అస్త్రంగా మలుచుకుంటుంది.. 2019 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, జేడీఎస్ ఇలా చాలా ప్రాంతీయ పార్టీలని కలుపుకొని పోవాలని చూస్తుంది.. అవసరమైతే కర్ణాటకలో మాదిరిగా, ఎన్నికల తర్వాత మిగిలిన ప్రాంతీయ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది.. ఇలా అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొనిపోతూ మోడీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది.. మరి హస్తం అస్త్రం పనిచేస్తుందో లేదో చూడాలి...


