TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోనియాతో వివేకా భేటీ ఆంతర్యం ఏమిటి?

Published on: Tue Feb 14, 2012 9:18AM

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కలిశారు. సోనియాతో రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. ఏప్రిల్‌లో రాజ్యసభకు ఖాళీలు ఏర్పడుతున్నందున తనకు అవకాశం ఇవ్వాలని సోనియాను అభ్యర్థించినట్లు సమాచారం. ఉప ఎన్నికలు, డీఎల్ అసమ్మతి గురించి కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో కూడా ఆయన సమావేశమయ్యారు. అయితే వివేకా మాత్రం వ్యక్తిగత పనుల మీద తాను ఢిల్లీ వచ్చానని, మర్యాదపూర్వకంగా మాత్రమే పార్టీ నేతలను కలిశానని ఆయన చెప్పారు.