TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దు ఓటర్లకు రామ్‌దేవ్ పిలుపు

Published on: Thu Jan 26, 2012 10:29AM

హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని ప్రముఖ యోగాగురువు బాబా రామ్‌దేవ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి బదులుగా భారతీయ జనతా పార్టీ, సీపీఐ పార్టీలకు ఓటు వేయాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం రూపంలో మగ్గుతున్న భారతీయ సంపదను స్వదేశానికి తీసుకొచ్చే ఓ మంచి కార్యక్రమంలో మిగిలిన పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. అందువల్ల భాజపా, సీపీఐలకు మాత్రమే ఓటు వేయాలని ఆయన కోరారు. నల్లధనంతో పాటు.. ఏడు అంశాలపై తమతమ అభిప్రాయం తెలపాలని అన్ని పార్టీలకు తాను లేఖ రాయగా, భాజపా, సీపీఐల నుంచి మాత్రమే సమ్మతం తెలుపుతూ లేఖ రాశాయని ఆయన గుర్తు చేశారు.