TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెసు,తృణమూల్ లమధ్య ముదురుతున్న విభేదాలు

Published on: Sun Jan 8, 2012 8:56AM

కోల్ కత్తా: కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెసు మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తమ మిత్రపక్షం కాంగ్రెసుపై తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ధ్వజమెత్తారు. కూటమి నుంచి కాంగ్రెసు తప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని, సిపిఎంతో కలిసి పనిచేయాలనుకుంటే వెళ్లిపోవచ్చునని ఆమె శనివారంనాడు అన్నారు. సింగూరు, నందిగ్రామ్‌ల్లో తమ పార్టీ ఒంటరిగానే పనిచేసిందని, ఒంటరిగా వెళ్లడానికి తమకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు. రచయితల భవనం వద్ద ఆమె కాంగ్రెసుపై తీవ్రంగా మండిపడ్డారు. రాయ్‌గంజ్ కాలేజీ ఆవరణలో జరిగిన హింసతో ఇరు పార్టీల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి.  రాయ్‌గంజ్ సంఘటన దురదృష్టకరమైందని ఆమె అన్నారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ విద్యార్థులను రాయ్‌గంజ్ కళాశాలలో నామినేషన్ వేయకుండా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కొడుతున్నారని, గత 34 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్నది ఇదేనని ఆమె అన్నారు. పెట్రోల్ ధరల పెంపును, రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐలను, లోక్‌పాల్ బిల్లులో లోకాయుక్త క్లాజ్‌లను తాము వ్యతిరేకించడం వల్ల కాంగ్రెసు తమపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోందని ఆమె అన్నారు.