TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణపై చంద్రబాబు లేఖపై మీడియాతో ఎర్రబెల్లి

Published on: Mon Jan 2, 2012 10:31AM

వరంగల్: కాంగ్రెసు స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇస్తారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని కాంగ్రెసు తెలంగాణ నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన  సోమవారం మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. తెలంగాణ కోసం తెలంగాణ కాంగ్రెసు నాయకులు వారి పార్టీపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేతులు కలిపారని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెరాస కుమ్మక్కయి తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.