పురంధేశ్వరి సీటుకే ఎసరుపెట్టనున్న సుబ్బిరామిరెడ్డి
Published on: Thu Dec 22, 2011 8:23AM
న్యూఢిల్లీ: కాం
గ్రెసు నేత టి.సుబ్బిరామిరెడ్డి కేంద్ర సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి లోకసభ సీటుపై కన్నేశారు. ఇప్పటి నుంచే ఆయన ఆ సీటు తనకు కావాలంటూ ప్రచారం సాగిస్తున్నారు.ఆ సీటును సంపాదించుకోవడానికి ఆయన ప్రజల పేరు వాడుతున్నారు. విశాఖపట్నంలో సుబ్బిరామిరెడ్డి చాలా కాలంగా సాంస్కృతిక, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీచేయాలని ప్రజలు కోరుతున్నారని ఆయన చెప్పారు.పురంధేశ్వరికి ఆయన ప్రత్యామ్నాయాలు కూడా చూపుతున్నారు. విశాఖ సిట్టింగ్ ఎంపీ పురంధేశ్వరి ఒంగోలు లేదా నార్సారావుపేట నుంచి పోటీ చేయాలని ఆయన సూచించారు. ఆమె ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి ముందు రాకపోతే తానే ఆ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలియజేశారు. ఆహారభద్రత,లోక్‌పాల్ బిల్లులకు కేంద్రం కట్టుబడి ఉందని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.


