TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కిరణ్ సర్కార్ ఫై మళ్లీ అవిశ్వాసం: చంద్రబాబు

Published on: Tue Jan 24, 2012 3:20PM

ఏలూరు: కాంగ్రెసు ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని,రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై మళ్లీ అవిశ్వాసం పెడతామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  అన్నారు. చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు పోరుబాట యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. తాగడానికి గుప్పెడు నీళ్లు లేక పోయినప్పటికీ అంతటా మద్యం మాత్రం ఏరులై పారుతోందన్నారు.రాష్ట్రం మద్యం గుప్పిట్లో ఉందన్నారు. ప్రభుత్వం హత్యా రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. చిరంజీవి సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టారన్నారు. రెండు మంత్రి పదవులకే చిరంజీవి సంతృప్తి చెందారని ఆయన అన్నారు. పిఆర్పీ లేకుంటే టిడిపియే గెలిచేదని, కాంగ్రెసులో చిరు కరివేపాకన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. పరిటాల రవీంద్రను చంపించింది వైయస్ సర్కారే అని ఆరోపించారు.అమలాపురంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసంపై ఆయన స్పందించారు. విగ్రహాల ధ్వంసం చాలా బాధాకరమన్నారు. రాజ్యాంగ నిర్మాతను కించపర్చడం సరికాదన్నారు. ఇది క్షమించరాని బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.