హైవోల్టేజ్ తీగలు తెగి... ఊహించని ఘోరం
Published on: Thu Feb 3, 2022 3:08PM
దక్షిణాఫ్రికా దేశమైన కాంగోలో ఘోరమైన ప్రమాదం సంభవించింది. కాంగో రాజధాని కిన్షాసాలో ఈ ఘోరం జరిగింది. హైవోల్టేజ్ తీగలు తెగిపడటంతో జనసమ్మర్దంగా ఉండే మార్కెట్లో 26 మంది అక్కడికక్కడే చనిపోయారు. వారిలో చాలా మంది శరీరాలు నల్లగా మాడిపోయి గుర్తు పట్టలేని విధంగా తయారయ్యాయి. పలువురి శరీర భాగాలు కట్టయ్యాయి. మృతుల్లో చాలా మంది కూడా సామాన్య పౌరులు, అంగట్లోకి వచ్చి సరుకులు కొనుక్కొనిపోయేవారు, ఆ మార్కెట్ గుండా వెళ్తున్నవారు మాత్రమే.
కాంగోలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మార్కెట్ ఏరియాలో కందకాలు తవ్వారు. ఆ కందకాలను డ్రైనేజీకి కలపడంతో ఆ నీళ్లన్నీ కందకాల్లో వచ్చి చేరాయి. మరోవైపు వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడిందని, ఆ పిడుగుపాటుకు హైవోల్టేజీ వైర్లు తెగి పడి ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఆ మార్కెట్ లో నిర్మాణాలన్నీ అక్రమంగా జరిగినవేనని, మార్కెట్ ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల్లో పలువురు వలసజీవులు కూడా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పొట్టకూటి అంగడికి వచ్చి సరుకులు కొనుక్కొని పోయే క్రమంలో మృత్యువాత పడటంతో విషాదం అలముకొంది.


