TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ పేరును గిన్నీస్ బుక్ లో చేర్చాలి..  ఎందుకో తెలుసా ? 

Published on: Fri Oct 8, 2021 4:17PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరును గిన్నిస్ బుక్‌లో చేర్చాల‌ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వి.హనుమంతరావు అన్నారు.అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి కేసీఆర్, అందరికంటే అగ్రస్థానంలో నిలుస్తారని అందుకే ఆయన పేరును, గిన్నిస్ బుక్‌లో చేర్చాల‌ని వీహెచ్ ఎద్దేవా చేశారు.ఈరోజు (శుక్రవారం) ఆయన మీడియతో పిచ్చాపాటిగా  మాట్లాడుతో ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. ఒక‌ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇంతలా సత్యదూరమైన మాటలు చెప్పడం తాను తొలి సారి వింటున్నాన‌ని అన్నారు. ఈ సందర్భంగానే వీహెచ్ తమదైన స్టైల్లో  అబ‌ద్ధాల ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ పేరును గిన్నిస్ బుక్‌లో చేర్చాల‌ని అన్నారు. 

దళితిలకు మూడు ఎకరాల భూమి ఇస్తామని తాము చెప్పలేదని ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ వీహెచ్, 2014 ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంగా దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు  మ‌ళ్లీ ఆయనే అలా ఎప్పుడూ చెప్పలేదని అన‌డం సిగ్గుచేటని విరుచుకుప‌డ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత దళిత బంధు  ఇలాగే నాలుక మడతేస్తారేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.

ముఖ్యమంత్రి చెప్పే అబద్ధాలు విని ప్రజలు చీద‌రించుకుంటున్నార‌ని అన్నారు. చిన‌జీయర్ స్వామిని కలిసి కేసీఆర్ అబద్ధాలు అడకుండా బోధించాలని కోర‌తాన‌ని చెప్పారు.గవర్నర్ త‌మిళిసై బతుకమ్మ ఆడ‌టం సంతోష‌క‌ర‌మ‌న్న వీహెచ్.. బతుకమ్మల మీద నుంచి కారు తీసుకెళ్లిన ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విష‌యంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాన‌ని తెలిపారు.