MCRHRDలో అడ్డగోలు నియామకాలు! హైకోర్టులో కాంగ్రెస్ నేత పిల్..
Published on: Mon Dec 6, 2021 3:20PM
తెలంగాణలో ప్రభుత్వ రూల్స్ ను అమలు చేయరా? నియామకాలను ఇష్టారాజ్యాంగా చేపడుతారా? అంటే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న నియామకాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు విరుద్దంగా ఎంసీహెచ్ఆర్డీలో నియామకాలు చేపట్టారంటూ ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. అక్రమ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ పిటిషన్ లో పొందు పరిచారు బక్కా జడ్సన్.
తెలంగాణలో 65 సంవత్సరాలకు పైబడిన వారికి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేదంటూ 2015 ఫిబ్రవరి 2న GO Ms NO.55 ద్వారా ఆర్థిక శాఖఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కన్సల్టెంట్లుగా లేదా సలహాదారులుగా లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేదు.

కాని గతంలో ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్దంగా MCRHRDలో నియామకాలు చేపట్టారు. గతంలో వివిధ శాఖల్లో పని చేసి పదవీ విరమణ పొందిన ముగ్గురు వ్యక్తులను ముఖ్యమైన పోస్టులలో నియమించారు. ఈ నియామకాలపైనే బక్కా జడ్సన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

MCRHRDలో నియామకాలకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించారు బక్కా జడ్సన్. MCRHRD డైరెక్టర్ జనరల్ పి.ప్రకాష్ రావును నియమించారు. డైరెక్టర్ ఆఫ్ ఫెసిలిటీస్ డీన్ గా డా.గౌతమ్ పింగిల్ తో పాటు డా.ప్రొఫెసర్అబ్బాస్ అలీని నియమించారు. వీళ్లకు జీతాలు కూడా భారీగానే ఇస్తున్నారు. అయితే వీళ్ల ముగ్గురి వయసు 65 సంవత్సకాలు పైనే. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్దమని తన పిటిషన్ లో బక్కా జడ్సన్ వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారని, ప్రభుత్వ నోటిఫికేషన్లు రాక వాళ్లంతా రోడ్లపై తిరుగుతున్నారని.. కాని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మాత్రం అక్రమంగా నియమాకాలు చేపట్టారని తెలిపారు బక్కా జడ్సన్. పబ్లిక్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయవచ్చని, కాని అక్రమంగా వయసు పైబడిన వారిని నియమించుకున్నారని చెప్పారు.
MCRHRDలో నియమించబడిన ముగ్గురి వివరాలను కూడా ఆర్టీఐ ద్వారా సేకరించారు బక్కా జడ్సన్. ప్రకాష్ రావు హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా మాత్రమే చదివారని తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం నుండి జనరల్ మేనేజర్ గా ఆయన రిటైర్ అయ్యారని చెప్పారు. అయినా ప్రకాశ్ రావు కీలక పోస్టు అప్పగించడంతో పాటు 70 వేల వేతనం, 30 వేల రూపాయల ఇన్సెంటివ్ తో పాటు కారును కూడా సంస్థే ప్రొవైడ్ చేసిందని తెలిపారు. డాక్టర్ గౌతమ్ పింగిల్ నెలవారీ జీతం లక్షన్నరగా ఉందన్నారు. ప్రొఫెసర్ అబ్బాస్ అలీకి 70 వేల వేతనంతో పాటు ఇతరత్రా అలవెన్సులు కూడా ఇస్తున్నారని చెప్పారు జాన్సన్.
ఈ పదవీ విరమణ పొందిన అధికారులు నిర్వహిస్తున్న మూడు పోస్టులు ఎవరికైనా ఇవ్వవచ్చని తన పిటిషన్ లో చెప్పారు జడ్సన్. MCRHRDలో కీలకమైన పోస్టులను తెలంగాణ వ్యక్తులకు కాకుండా ఇతరులకు ఇవ్వడంపైనా జాన్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకాష్ రావుకు అనుకూలంగా జారీ చేసిన రెండు నియామక పత్రాలను పిటిషన్ లో అందించారు జాన్సన్. MCRHRDI డైరెక్టర్ సంస్థను తన ఆధీనంలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, నియామకాలు అడ్డగోలుగా చేపడుతున్నారని జాన్సన్ ఆరోపించారు. ప్రకాశ్ రావుకు ఇచ్చిన డైరెక్టర్ ఫెసిలిటీ పోస్ట్ మంజూరు చేయబడిన పోస్ట్ కాదని.. కొత్తగా స్పష్టించి ఇచ్చారని తెలిపారు. కొత్తగా పోస్టును క్రియేట్ చేసి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిని ఎలా నియమించారని ప్రశ్నించారు.


