TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్రిస్టియన్ ఓట్లకు గాలం వేస్తున్న పార్టీలు?

Published on: Tue May 15, 2012 9:21AM

ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీలు క్రిస్టియన్ ఓట్లకు కిరాయికడుతున్నారు. ముందుగా ఫాస్టర్ల జాబితా ఇవ్వాలని, దానిలో సభ్యత్వాల వివరాలు కూడా ఉంటే బాగుంటుందని చర్చి ఫాస్టర్ల సంక్షేమ సంఘ నిర్వాహకులు పార్టీలను కోరాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న కమ్యూనిటీ ఓటింగ్ లెక్కలతో దీన్ని సరిపోల్చుకుని ఎక్కడ డబ్బు పెడితే ప్రయోజనం ఉంటుందో కూడా పార్టీలు లెక్క చూసుకుంటున్నాయి.

 

 

 

తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజక వర్గంలో పోటీ చేస్తున్న మూడు ప్రధానపార్టీలూ ఈ వివరాలు అడిగాయని ఆ ఫాస్టర్ల సంఘ నిర్వాహకులు తెలిపారు. అయితే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రత్యేకించి బ్రదర్ అనిల్ నుంచి ఇప్పటికే వర్తమానాలు అందాయని తెలుస్తోంది. ప్రధానపార్టీలే కోరాయి కాబట్టి సంఘపరంగా వివరాలిస్తామే కానీ, ఆ పార్టీల కార్యకలాపాలకూ తమకూ ముడిపెట్టవద్దని కోరారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీల నుంచి కబుర్లు అందినంత మాత్రాన తాము ఆయా పార్టీలు చెప్పినట్లు చేస్తామనుకోవడం పొరపాటని పాస్టర్ల సంఘం నిర్వాహకులు అంటున్నారు. అయితే డబ్బు ప్రభావం ఎంతో కొంత ఉంటుందని, క్రిస్టియన్ల ఓటింగ్ పై ఉంటుందని మాత్రం వారు "తెలుగువన్.కామ్'' ఎదుట అంగీకరించారు.