ఆనందానికి, ఆలోచనకూ మధ్య సంబంధం?

 

 

 

ఏకాగ్రత ఉంటే ఎంత కష్టమైన పనినైనా సాధించవచ్చు అని అందరికి తెలిసిందే. అయితే మన లక్ష్య సాధనకే కాదు ఆనందంగా ఉండడానికి కూడా ఏకాగ్రత దోహదపడుతుంది అంటున్నారు పరిశోధకులు. ఆశ్యర్యంగా అనిపించినా ఇది నిజం! ఏకాగ్రతతో పనిచేసేవారు ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆ మధ్య ఆనందానికి, ఆలోచనకూ మధ్యగల సంబంధాన్ని తెలుసుకోవడానికి అమెరికాలో ఒక అధ్యయనం నిర్వహించారట. దీనిలో భాగంగా 83 దేశాలకు చెందిన వివిధ వృత్తులు, వయసుల వారిని వివిధ అంశాలపై ప్రశ్నించారు. వాటి ఆధారంగా అధ్యయన కర్తలు ఎక్కువ ఏకాగ్రతతో పనిచేచే వారు అంత ఆనందంగా ఉంటారని తేల్చారు.

 

83 దేశాలకు చెందిన వివిధ వృత్తులు, వివిధ వయసుల వారిని ఏయే సమయాలలో ఎలా ఆలోచిస్తున్నారు, ఏమాలోచిస్తున్నారు అప్పుడు వారి అనుభూతి వంటి, ఏ పని చేస్తున్నపుడు ఏ దృక్పధం తో వున్నారు వంటి అంశాల పై ప్రశ్నించి వాటిని విశ్లేషించి, పరిశీలించారు. వీరిలో చాలా మంది పనిచేస్తున్న T.V  చూస్తున్నా, తింటున్నా చివరికి షాపింగ్ చేస్తున్నా ఇతర విషయాల  గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు గుర్తించారు. ఫలితంగా ఆ సమయంలో న్యాయంగా పొందల్సినంత ఆనందాన్ని వారు  పొందలేక పోతున్నారని గుర్తించారు పరిశోధకులు.



నిజానికి మనం మనకే తెలియకుండానే నిరంతరం ఆలోచనల్లో మునిగి వుంటాం. అవి సంతోషానిచ్చే ఆలోచనలు అయినపుడు అప్పటి  మన అనుభవంతో సంబంధం లేకుండా మన మనసు సంతోషం గా వుంటుంది. అదే Negative  ఆలోచనలు మన మనసులో సుడులు తిరుగుతుంటే ఆనందానిచ్చే  విషయాలకి మన ప్రతిస్పందన పూర్తి స్థాయిలో వుండదు. ఏది ఏమైనా మనసు  లగ్నం చేయందే ఏపని పూర్తి ఆనందాన్ని అందించదు అని ఖచ్చితంగా చెబుతున్నారు అధ్యయకర్తలు....

 

.......రమ