భార్యను మరో మహిళలో పోల్చి చులకన చేయడం వేధింపే!
Published on: Thu Aug 18, 2022 7:28AM
భార్యను మరో మహిళతో పోల్చి చులకన చేయడం వేధింపుల కిందకే వస్తుంది. కేరళ హైకోర్టు ఈ మేరకు విస్పష్ట తీర్పు చెప్పింది. భార్యను మరో మహిళతో పోల్చి చులకన చేయడం మానసిక వేధింపేనని ఒక విడాకుల కేసులో కేరళ హై కోర్టీ పేర్కొంది. వివరాల్లోకి వెళితే..
మూడేళ్ల కిందట వివాహబంధంతో ఒక్కటైన జంట విడాకుల కేసులో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భార్యతో విభేదాల కారణంగా విడాకులు కోరుతూ భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా తాను అందంగా లేనంటూ భర్త నిత్యం వేధిస్తున్నాడనీ, ఇతర మహిళలతో పోలుస్తూ తనను కించపరుస్తున్నాడనీ, దాంతో తాను మానసిక క్షోభకు గురై డిప్రషన్ కు గురయ్యాననీ భార్య కోర్టుకు తెలిపింది.
ఈ కేసు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ సుధతో కూడిన హైకోర్టు బెంచ్ భార్యను ఇతర మహిళతో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం మానసిక వేధింపుల కిందికి వస్తాయని స్పష్టం చేసింది.


