TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకుల ఆందోళన కారణమేంటంటే?

Published on: Sat Nov 8, 2025 10:01AM

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం (నవంబర్ 7) రాత్రి నుంచి ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు.  రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన వన్ 984 విమానం సాంకేతిక లోపాలు కారణంగా చెబుతూ తీవ్రజాప్యం కావడంతో ప్రయాణీకులు ఆందోళన చేపట్టారు. శనివారం (నవంబర్ 8) ఉదయానికి కూడా విమానం ఎప్పుడు బయలుదేరుతుందన్న విషయాన్ని అధికారులు చెప్పకపోవడం, సరైన సమాచారం ఇవ్వకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడంతో దాదాపు 200 మంది ప్రయాణికులు రాత్రంతా ఎయిర్‌పోర్ట్‌లోనే పడిగాపులు పడుతున్నారు.

విమానం ఎప్పుడు టేక్‌ఆఫ్ అవుతుందనే విషయంపై సిబ్బంది స్పష్టమైన సమాచారం ఇవ్వకపో వడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం (నవంబర్ 8) ఉదయం కూడా పలు విమానాలు రద్దు కావడం, టేకాఫ్ కు తీవ్ర జాప్యం జరగడంతో శంషాబాద్ విమానాశ్రయంలో పరిస్థితి  ప్రయాణీకుల ఆందోళనలతో ఉద్రిక్తంగా మారింది.  

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో 6ఇ051, అలాగేముంబైకి వెళ్లాల్సిన 6ఇ245 వి మానాలు రద్దు కాగా, పలు విమానాలు ఆలస్యం అయ్యాయి.   దీంతో ప్రయాణికులు ఎయిర్‌లైన్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు సరైన వివరణ ఇవ్వకపోవడం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

శుక్రవారం (నవంబర్ 7)  ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌  వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య మరువక ముందే ఇవాళ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో  విమానాల రద్దు, జాప్యం జరుగుతుండటంతో అసలేం జరుగుతోందంటూ ప్రయాణీకులు అధికారులను నిలదీస్తున్నారు.