ఉమ్మడి రాజ‌ధానికి ఒప్పుకోం

 


విభ‌జ‌న‌కు వ్యతిరేఖంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్న నేప‌ధ్యంలో తెలంగాణ నాయ‌కులు కూడా త‌మ స్వరం పెంచారు. రాష్ట్రవిభ‌జ‌న అనివార్యం అయిన ప‌క్షంలో హైద‌రాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజ‌ధానిగా చేయాల‌న్న కొంద‌రు సీమాంద్ర నాయ‌కుల వాద‌నను వారు ఖండిచారు.

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని తాత్కలిక ఉమ్మడి రాజ‌ధానిగా అయితేనే అంగీక‌రిస్తాం త‌ప్ప శాశ్వత ఉమ్మడి రాజ‌ధానిగా అంగీక‌రించే ప్రస‌క్తే లేద‌ని తేల్చిచెప్పారు. ఈనెల 29వ తేదీన సకల జనుల భేరీ నిర్వహిస్తామని జేఏసీ నేతలు వెల్లడించారు.

దీనితో పాటు తెలంగాణ జిల్లాలో ప‌దిరోజుల పాటు స‌న్నాహ‌క ర‌ణ‌భేరి ర్యాలీలు నిర్వహిస్తున్నట్టుగా ప్రక‌టించారు. రాష్ట్ర రాజ‌ధాని పై పెద్ద మ‌నుషుల ఒప్పందం త‌ర‌హాలో నిర్ణయం జ‌ర‌గాల‌న్నారు. అలాగే రాజ‌ధాని విష‌యంలో ఎలాంటి మార్పు లేకుండా మంత్రులు ప్రజా ప్రతినిధుల‌పై వ‌త్తిడి తీసుకు వ‌స్తామ‌ని జెఏసి నాయ‌కులు ప్రక‌టించారు.