TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రక్షాళనలకు సర్కారు సన్నాహాలు

Published on: Fri Apr 17, 2026 6:19PM

 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రిపేర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కల్నల్ పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంజినీర్లు, నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మూడు బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రిపేర్‌ పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

మాన్సూన్‌కు ముందే జియో టెక్నికల్ పరిశీలనలు పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ సూచించింది. మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తిచేయాలని డెడ్‌లైన్ విధించింది. రోజువారీ పురోగతి నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. సీడబ్ల్యూసీ ఎన్డీఎస్ఏ అనుమతులతో పనులు, డిజైనింగ్ పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. రోజువారీ యాక్షన్ ప్లాన్‌తో పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.