హైదరాబాద్ వాటర్ లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సీపీ సజ్జనార్
Published on: Fri Jun 19, 2026 11:17AM
.webp)
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమాజిగూడలోని జీఆర్టీ జంక్షన్, ప్రజా భవన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాటర్ లాగింగ్ ప్రాంతాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, డీసీపీ అవినాష్ కుమార్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని రహదారులపై నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలగించాలని, వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అలాగే వర్షం తగ్గి రోడ్లపై నీటి నిల్వలు పూర్తిగా తొలగే వరకు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రయాణికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.


