TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ పోలీసులకు కమిషనర్‌ సజ్జనార్ కీలక సూచనలు

Published on: Sat Oct 11, 2025 8:19PM

 

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వి.సి. సజ్జనార్ నేడు మొదటిసారిగా నగరంలోని అన్ని విభాగాలు మరియు పోలీస్ స్టేషన్ల (లా & ఆర్డర్, ట్రాఫిక్) అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ వ్యవస్థను మరింత ప్రజాను కూలంగా, సమర్థ వంతంగా మార్చ డంపై పలు కీలక సూచనలు, సలహాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా సజ్జనార్  మాట్లాడుతూ “గత ఆరు నెలలుగా సిటీ పోలీస్ ప్రతి విభాగంలోను అద్భుతంగా పనిచేసింది. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని సిపి అన్నారు. ఇదే ఉత్సాహంతో, నిబద్ధతతో ముందుకు సాగితే, హైదరాబాద్ కమిషనరేట్ ప్రతిష్టను దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లవచ్చునని సిపి పేర్కొన్నారు.

ఎవరైనా సరే  విధుల్లో నిర్లక్ష్యం చూపితే అట్టి వారిపై కఠిన చర్యలు తప్పవు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకో వడం అసహ్యకర మంటూ హెచ్చరిం చారు. కానీ విధులు సమర్థవంతంగా నిర్వర్తించిన సిబ్బందిని ప్రత్యేకం గా గుర్తించి ప్రశంసిస్తామని స్పష్టం వ్యక్తం చేశారు.

పోలీసులు ప్రజలతో మమేకమై పనిచే యడం ఎంత ముఖ్యమో వివరించారు. “పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదు దారులను మర్యా దపూర్వకంగా, సహానుభూతితో ఆదరించండి. మీ ప్రవర్తనే పోలీస్ శాఖ ఇమేజ్‌ను నిర్ణయిస్తుందని సిపి అన్నారు...

ఎక్స్‌ట్రా మైల్ రివార్డ్” కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్ సిపి సజ్జనార్  కొత్తగా ‘ఎక్స్‌ట్రా మైల్ రివార్డ్’ అనే ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రకటించారు. “విధి నిర్వర్తనతో పాటు మానవతా దృక్పథం తో పనిచేసిన వారిని ప్రతి శనివారం గుర్తించి ప్రశంసాపత్రం మరియు రివార్డుతో సత్కరిస్తామని వెల్లడించారు.

డ్రగ్ రహిత నగరమే లక్ష్యం

“హైదరాబాద్‌ను డ్రగ్ రహిత నగరంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. డ్రగ్ కేసుల్లో నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. మహిళలు, చిన్నారుల భద్రత పై ఎటువంటి రాజీ ఉండకూడదు. షీ టీమ్స్, లా & ఆర్డర్ విభాగాలు సమన్వ యంతో పని చేయాలి.అలాగే నగర ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ఆలోచనలు చేయాలి. ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలిగించే మార్గాలు వెతకాలని  సూచించారు.

సిబ్బందికి ప్రోత్సాహం, అభినందనలు

సజ్జనర్  ఇటీవల మాదన్నపేట పీఎస్ పరిధిలో జరిగిన చిన్నారి హత్య కేసు చేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్సైలు సుధాకర్, శోభ, సాయికాంత్, శివకుమార్ తదితరులను అభినందించారు. అలాగే నిరాశ్రయు లను ఆదరించి అమ్మనాన్న ఆశ్రమా నికి తరలించిన అప్జల్ గంజ్ ఎస్‌హెచ్‌వో రవి, అడ్మిన్ ఎస్సై నిరంజన్, ఏఎస్సై ధర్మేందర్ లను ప్రశంసించారు.

30 ఏళ్ల తర్వాత ఓ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన ఫిలింనగర్ హెడ్ కానిస్టేబుల్ విజయ సుధాకర్, కానిస్టేబుల్ సురేందర్ లను కూడా సత్కరిం చారు. మెరుగైన పోలీసింగ్ కోసం మీ సలహాలు, సూచ నలు నేరుగా నాకు తెలియజే యండి. అంతేకాక ముఖ్యం గా పని ఒత్తిడిలో  మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సిబ్బందికి సూచించారు.