TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పేకాడుతూ దొరికిన సినీ నటి

Published on: Mon Apr 27, 2015 12:02PM

 

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్లు ధరించే కరాటే కళ్యాణి అనే నటి పేకాడుతూ పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌ సమీపంలోని చింతల్ కుంట ప్రాంతంలో ఒక ఇంట్లో పేకాట జోరుగా సాగుతోందన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడుతున్న సినీ నటి కరాటే కళ్యాణితోపాటు మరో 11 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి 75 వేల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.